Devineni Avinash: సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి: దేవినేని అవినాష్

  • గ్రామగ్రామాల్లో ప్రచారం చేస్తాం
  • టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం
  • యువజన సదస్సులకు శ్రీకారం చుట్టాం

సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. నేడు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకంపై గ్రామగ్రామాల్లో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యమన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే యువజన సదస్సులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

Devineni Avinash
Srikakulam
Telugudesam
Social Media
  • Loading...

More Telugu News