yamini sadhineni: పీఠాధిపతిగా ఉండి ఇలా మాట్లాడతారేమిటి స్వామీ: యామిని సాధినేని

  • పీఠాధిపతిగా ఉండి వైసీపీకి అనుకూలంగా ఎలా మాట్లాడతారు?
  • రాజకీయాలతో స్వామీజీలకు ఏం పని?
  • పీఠాధిపతి పదవిని వదిలేసి.. వైసీపీలో చేరిపోండి

విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిపై టీడీపీ నాయకురాలు యామిని సాధినేని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు వేస్తానని వ్యాఖ్యానించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఒక పీఠాధిపతిగా ఉండి రాజకీయ పార్టీ వైసీపీకి అనుకూలంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాలతో స్వామీజీలకు పనేంటని అడిగారు. భక్తులకు ప్రవచనాలు చెప్పాల్సిన వ్యక్తులు.... రాజకీయాల గురించి మాట్లాడటం ఎంత వరకు సమంజసమని అన్నారు. రాజకీయాలు కావాలనుకుంటే పీఠాధిపతి పదవిని వదిలేసి, వైసీపీలో చేరాలని సూచించారు.

yamini sadhineni
swaroopananda swamy
Telugudesam
  • Loading...

More Telugu News