YSRCP: వచ్చే వాళ్లందరినీ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటే టీడీపీ సగం ఖాళీ అవుతుంది: అవంతి శ్రీనివాస్

  • అన్ని చోట్ల మాకు కేడర్, అభ్యర్థులూ ఉన్నారు
  • ఎవరినైతే సర్దుబాటు చేయగలరో వారినే జగన్ తీసుకుంటున్నారు
  • గతంలో పవన్, మోదీ వల్లే చంద్రబాబు గెలిచారు

టీడీపీ నుంచి వచ్చే వాళ్లందరినీ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలోకి తీసుకుంటే ఆ పార్టీ సగం ఖాళీ అయిపోతుందని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి కేడర్ ఉందని, అభ్యర్థులూ ఉన్నారని అన్నారు. తన నియోజకవర్గం నుంచి గానీ వేరే నియోజకవర్గాల నుంచి గానీ టీడీపీలోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అయితే, ఎక్కడ, ఎవరిని అయితే సర్దుబాటు చేయగలరో వారిని మాత్రమే వైసీపీలోకి జగన్ తీసుకుంటున్నారని అన్నారు. అందుకే, తాను వైసీపీలోకి వచ్చేటప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, లేకపోతే, తాను ఆహ్వానిస్తే తన వెంట వచ్చే వారు చాలా మంది ఉన్నారని అన్నారు. గత ఎన్నికల్లో పవన్, మోదీ పుణ్యమా అని చంద్రబాబు గెలిచిన విషయాన్ని అవంతి గుర్తుచేశారు.

YSRCP
ys
Jagan
avanti srinivas
  • Loading...

More Telugu News