arun pandian: వెండితెరకి మరో స్టార్ హీరో వారసురాలు

  • నిన్నటితరం యాక్షన్ హీరోగా అరుణ్ పాండ్యన్ 
  • తమిళ చిత్రంతో కీర్తి పాండ్యన్ పరిచయం
  • హరీశ్ రామ్ దర్శకత్వంలో 'దర్శన్' జోడీగా      

తమిళంలో సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు .. కథానాయికలుగా తమ జోరును చూపించడానికిగాను ఒకరి తరువాత ఒకరుగా రంగంలోకి దిగుతున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కథానాయికగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో అరుణ్ పాండ్యన్ కూడా తన కూతురు కీర్తి పాండ్యన్ ను వెండితెరకి పరిచయం చేస్తున్నారు. 90వ దశకంలో తమిళంలో యాక్షన్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఆయన, అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఆయన కూతురు కీర్తి పాండ్యన్ తమిళంలో తొలి సినిమా చేస్తోంది. హరీశ్ రామ్ దర్శకత్వంలో 'దర్శన్' జోడీగా ఓ యాక్షన్ సినిమాలో ఆమె కనిపించనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అరుణ్ పాండ్యన్ కూడా కనిపిస్తాడని అంటున్నారు.

arun pandian
keerthi pandian
  • Loading...

More Telugu News