Ganta Srinivasa Rao: నా కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారు: అవంతి శ్రీనివాస్

  • నేను వైసీపీలో చేరడంతో గంటా వెనక్కి తగ్గారు
  • వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు
  • కానీ, మా పార్టీలో ఖాళీలుండాలిగా

ఏపీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ పై ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారని, తాను వైసీపీలో చేరడంతో ఆయన వెనక్కి తగ్గారని ఆరోపించారు. వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ, తమ పార్టీలో ఖాళీలు ఉండాలిగా అని వ్యాఖ్యానించారు.

టీడీపీని వీడిన అవంతిపై ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులతోనే విమర్శలు చేయించడంపై ప్రశ్నించగా, ‘అదే కదా దురదృష్టం. చంద్రబాబునాయుడు గారికి అదొక ఆనందం. వికృతమైన ఆనందం. ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా ఆయన్ని ప్రశ్నించకూడదు. దళితులు ప్రశ్నిస్తే దళితులతో, కాపులు ప్రశ్నిస్తే కాపులతోనే ఆయన తిట్టిస్తారు. ప్రజలకు వాస్తవం ఏంటో తెలుసు. ఆంధ్రా ప్రజలు చాలా తెలివైన వాళ్లు. సమయం వచ్చినప్పుడు తీర్పును చాలా కరెక్టుగా ఇస్తారు’ అని నిప్పులు చెరిగారు.

Ganta Srinivasa Rao
avanti srinivas
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News