swami agnivesh: పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్థాన్ ను నిందించడం సరికాదు: స్వామి అగ్నివేశ్ సంచలన వ్యాఖ్యలు

  • ఆధారాలు ఉంటేనే పాకిస్థాన్ ను నిందించాలి
  • ఉగ్రదాడిని పాకిస్థాన్ ఖండించింది
  • దాడికి పాల్పడింది భారత కశ్మీరీ

పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపించడం సరికాదని ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు ఆధారాలు ఉంటేనే వారిని నిందించాలని అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు పాకిస్థాన్ ఇప్పటికే ప్రకటించిందని... ఒకవేళ ఆ దేశం ఖండించని పక్షంలో వారిని నిందించవచ్చని చెప్పారు. జవాన్లపై దాడికి పాల్పడింది భారత కశ్మీరి అని తెలిసి కూడా పాక్ ను నిందిస్తున్నారని అన్నారు. స్వామి అగ్నివేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయనపై పలువురు మండిపడుతున్నారు.

swami agnivesh
pulwama
pakistan
kashmir
  • Loading...

More Telugu News