ponnuru: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడిపై మత్స్యకారుల ఆరోపణ!

  • ఇసుక ర్యాంపుల వ్యవహారంలో సురేంద్ర జోక్యం తగదు
  • యూనిట్ ఇసుకను ఒడ్డుకు తరలిస్తే రూ.400 ఇవ్వాలి
  • మాకు రూ.150 మాత్రమే ఇస్తున్నాడని ఆరోపణ

గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడు సురేంద్రపై రాజధాని ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఆరోపణలు చేశారు. అధికార బలంతో సురేంద్ర తమ పొట్టకొడుతున్నారని వాపోయారు. కృష్ణా నది నుంచి యూనిట్ ఇసుకను ఒడ్డుకు తరలిస్తే రూ.400 ఇవ్వాలి కానీ, సురేంద్ర తమకు రూ.150 మాత్రమే ఇస్తున్నాడని ఆరోపించారు. మూడేళ్ల నుంచి సురేంద్ర తమ జీవితాలతో ఆడుకుంటున్నారని, యూనిట్ కు రూ.400 ఇవ్వాలని కోరితే తమపై కేసులు పెడతామంటున్నారని ఆరోపించారు. ఇసుక ర్యాంపులపై జోక్యం చేసుకుంటున్న సురేంద్రను అరెస్ట్ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. 

ponnuru
Dhulipala Narendra Kumar
brother
surendra
sand
amaravathi
  • Loading...

More Telugu News