best toilet paper in the world: ప్రపంచంలో బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏదని గూగుల్ లో వెతకండి... షాకవుతారు!

  • టాప్ సెర్చ్ రిజల్ట్ గా వస్తున్న పాకిస్థాన్ జెండా
  • సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్న ఫొటోలు
  • మండిపడుతున్న పాకిస్థానీలు

ప్రపంచంలో బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏంటని గూగుల్ లో శోధిస్తే... టాప్ రిజల్ట్ గా పాకిస్థాన్ జెండా వస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో, దీనికి మరింత ప్రచారం వస్తోంది. #besttoiletpaperintheworld హ్యాష్ ట్యాగ్ తో దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో భారీ ఎత్తున షేర్ అవుతున్నాయి. మరోవైపు ఈ విషయంలో గూగుల్ పై పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా  గూగుల్ లో ఇలాంటిదే చోటు చేసుకుంది. ఇడియట్ అని టైప్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటో వచ్చేది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News