junior ntr: జగన్ ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామగారు

  • జగన్ తో భేటీ అయిన నార్నె శ్రీనివాసరావు
  • రాజకీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం
  • మర్యాదపూర్వకంగానే కలిశానన్న నార్నే

హీరో జూనియర్ ఎన్టీఆర్ మామగారు (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నె శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలోని రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు, వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న తరుణంలో... ఈ భేటీ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మీడియాతో మాట్లాడుతూ నార్నె తెలిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశానని చెప్పారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... ఈ క్రమంలోనే ఆయనను కలిశానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీలోకి నార్నె శ్రీనివాసరావు చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీలో అప్పుడు ఆయన చేరలేదు.

junior ntr
fathe in law
narne srinivas rao
jagan
ysrcp
tollywood
  • Loading...

More Telugu News