jagan: జగన్ బయోపిక్ తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది: బుద్ధా వెంకన్న సెటైర్

  • బీసీ గర్జన పేరుతో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చారు
  • పక్క రాష్ట్ర సీఎంతో కలసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు
  • కేసులు ఉన్న జగన్ కు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదు

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మల్సీ బుద్దా వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు. బీసీ గర్జన పేరుతో నోటికొచ్చిన హామీలన్నింటినీ జగన్ గుప్పించారని విమర్శించారు. జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సంక్షేమం ఉంటుందని... జగన్ వస్తే శ్మశానమవుతుందని అన్నారు.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చేయి కలిపి, రాష్ట్రానికి జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల గురించి జగన్ ఏనాడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందునే బీసీలపై మొసలి కన్నీరు కార్చుతున్నారని అన్నారు. ఎన్నో కేసులు ఉన్న జగన్ కు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదని చెప్పారు. విదేశాల్లో అయితే జగన్ ఈ పాటికి ఊచలు లెక్కిస్తూ ఉండేవారని అన్నారు. జగన్ బయోపిక్ తీస్తే... బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ఎద్దేవా చేశారు.

jagan
budda venkanna
Telugudesam
ysrcp
Chandrababu
  • Loading...

More Telugu News