Pandula Ravindrababu: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి కారణాన్ని చెప్పిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

  • రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని చెప్పారు
  • గెలిచే సత్తా ఉన్న నన్ను అవమానించారు
  • మీడియాతో పండుల రవీంద్రబాబు

నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి, ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరిచిన అమలాపురం ఎంపీ, టీడీపీ నేత పండుల రవీంద్రబాబు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను పార్టీ మారడానికి గల కారణాన్ని వెల్లడించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ ను తనకు ఇచ్చేది లేదని తెలుగుదేశం అధిష్ఠానం స్పష్టం చేసిందని అన్నారు.

ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసి, తిరిగి గెలిచే సత్తా ఉన్న తనను కాదని మరొకరిని ఎంచుకోవడంతోనే, తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగరాదని నిర్ణయించుకున్నానని రవీంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Pandula Ravindrababu
YSRCP
Telugudesam
Resign
  • Loading...

More Telugu News