Flipkart: ఫ్లిప్ కార్ట్ లో ఐదు రోజుల పాటు... పలు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. వివరాలు!

  • 19 నుంచి 23 వరకూ 'మొబైల్స్ బొనాంజా సేల్'
  • రూ. 3 వేల వరకూ ధర తగ్గింపు
  • అదనపు డిస్కౌంట్లు ఇస్తామంటున్న ఫ్లిప్ కార్ట్

మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్'ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 23 వరకూ ఐదు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక అమ్మకాల్లో భాగంగా, పలు స్మార్ట్ బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని బ్యాంకుల కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే, అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తామని పేర్కొంది.

ఆఫర్ల వివరాల్లోకి వెళితే... రూ. 19,999 ఎంఆర్పీ ఉన్న పోకో ఎఫ్‌‌1 - 6జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ ఉన్న స్మార్ట్ ఫోన్ ను రూ.17,999 లకే అందించడంతో పాటు రూ.3,000  ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇదే వేరియంట్ లో 128 జీబీ స్టోరేజ్ ఉండే ఫోన్ ను రూ. 20,999కి అందిస్తామని వెల్లడించింది. రియల్‌ మి 2 ప్రొ 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ను రూ. 11,990 కు లభిస్తోంది. దీని ప్రస్తుత ధర రూ. 12,990 కాగా, రూ. 1000 డిస్కౌంట్ ను ప్రకటించింది. రూ. 13,999 ధరలో ఉన్న రెడ్‌ మీ నోట్‌ 6 ప్రో... 4 జీబీ రామ్, 64 జబీ స్టోరేజ్‌ వేరియంట్ ను రూ. 12,999 ధరకు విక్రయించనుంది.

రూ. 14,999 ఎంఆర్పీ ధరలో లభిస్తున్న ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఎం2- 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ పై రూ. 3 వేలు డిస్కౌంట్ ఇస్తూ,  రూ. 11,999కే అందించనుంది. ఆనర్‌ 9ఎన్‌ 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ను రూ. 8,499కు, వివో వి9 ప్రో 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ పై రూ. 2 వేల డిస్కౌంట్ ఇస్తూ రూ. 12,490కి విక్రయిస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. మోటరోలా వన్‌ పవర్‌ 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ను రూ. 13,999కే అందిస్తామని తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News