Pakistan: పంచ్ పడగానే పంచ్ విసరడానికి ఇదేమైనా బాక్సింగా?... సమయం రావాలి: 'రా' మాజీ చీఫ్

  • 'జాతీయ భద్రతకు బాహ్య నిఘా' సెమినార్
  • పాల్గొన్న రా మాజీ చీఫ్ విక్రమ్ సూద్
  • పాకిస్థాన్, చైనా మధ్య క్విడ్ ప్రోకో

ఉగ్రదాడి జరగగానే, తిరిగి దాడులు చేయడానికి ఇదేమీ బాక్సింగ్ రింగ్ కాదని రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ విక్రమ్ సూద్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో 'జాతీయ భద్రతకు బాహ్య నిఘా' అనే అంశంపై సెమినార్ జరుగగా, ఆయన పాల్గొని ప్రసంగించారు. పుల్వామా దాడి కేవలం అదిల్ ఒక్కడి వల్లే సాధ్యమైందని తాను భావించడం లేదని, అతని వెనుక చాలా పెద్ద బృందమే ఉందని అన్నారు.

ప్రత్యక్షంగా ఇండియాను ఎదుర్కోలేని పాకిస్థాన్, ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తోందని చెప్పారు. "ఇదేం బాక్సింగ్‌ మ్యాచ్‌ కాదు. పంచ్‌కు బదులు పంచ్‌ విసరడానికి. ప్రధాని మోదీ చెప్పినట్లుగా అందుకు సరైన సమయం రావాలి" అని ఆయన అన్నారు.

చైనాలోని జింగ్ జాంగ్ ప్రావిన్స్ లో పాకిస్థాన్ తన ఉగ్రవాదులను మోహరించిందని, అయితే చైనాతో కుదుర్చుకున్న క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగా, ఆ ఉగ్రవాదులు చైనాలో ఎటువంటి దాడులకూ దిగబోరని, అందువల్లే పాకిస్థాన్ కు చైనా అండగా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News