Major Chitresh Singh: పెళ్లికి 19 రోజుల ముందు... ఇంటికి విగతజీవిగా వచ్చిన మేజర్... వేలమంది కన్నీరు!

  • నిన్న బాంబ్ ను డిఫ్యూజ్ చేస్తుంటే ప్రమాదం
  • ఐఈడీ బాంబ్ పేలి మేజర్ చిత్రేష్ సింగ్ మృతి
  • మార్చి 7న వివాహం, అంతలోనే విషాదం 

తన బిడ్డ వివాహాన్ని వైభవంగా జరిపించాలని కలలుకన్న ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. మరో 19 రోజుల్లో వివాహం ఉందనగా, కుమారుడి మృతదేహాన్ని చూసిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా, వేలాది మంది అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఆదివారం నాడు జమ్మూ కశ్మీర్ లో ఓ ఐఈడీ బాంబ్ ను డిఫ్యూజ్ చేస్తూ, అమరుడైన మేజర్ చిత్రేష్ సింగ్ భౌతికకాయం, ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు ఈ ఉదయం చేరుకుంది.

31 సంవత్సరాల చిత్రేష్ కు మార్చి 7వ తేదీన పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. ఈ పెళ్లి నిమిత్తం ఆయనకు సెలవు కూడా మంజూరైంది. మరో రెండు వారాల్లో ఆయన ఇల్లు చేరుకోవాల్సి వుండగా, ఇలా విగతజీవిగా వచ్చి, ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. చిత్రేష్ సింగ్ భౌతిక కాయం వద్ద ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద సింగ్ రావత్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



Major Chitresh Singh
IED Bomb
Marriage
  • Loading...

More Telugu News