Soldiers: పుల్వామా ఘటన మరువకముందే కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు భద్రతా సిబ్బంది వీర మరణం

  • పుల్వామాలోనే మొన్నటి ఘటనకు సమీపంలోనే ఎన్‌కౌంటర్
  • అమరుల్లో ఆర్మీ మేజర్
  • నక్కి ఉగ్రవాదుల కోసం వేట

పుల్వామా ఉగ్రదాడిని మర్చిపోకముందే జమ్ముకశ్మీర్‌లో మరో ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలోని పింగ్లం ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. వీరిలో ఓ ఆర్మీ మేజర్ కూడా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశానికి అతి దగ్గర్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.

అమరులైన భద్రతా సిబ్బంది 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వారు. కాగా, ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారి కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు కూడా మృతి చెందినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

Soldiers
Encounter
Pulwama
Jammu and Kashmir
CRPF
  • Loading...

More Telugu News