Chigurupati Jayaram: తప్పించుకునే మార్గం లేక ఇరుక్కుపోయిన జయరాం

  • వీణ వద్దకు తీసుకెళ్తున్నట్టు జయరాంను నమ్మించిన రాకేశ్ స్నేహితుడు
  • చివరి నిమిషంలో గుర్తించిన జయరాం
  • అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న రాకేశ్ రెడ్డి

ప్రవాసాంధ్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం తప్పించుకునే మార్గంలేకే రాకేశ్ రెడ్డికి చిక్కినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జయరాం హత్యకు పక్కాగా ప్రణాళిక వేసిన రాకేశ్ రెడ్డి.. జయరాంతో ఖాళీ దస్తావేజులపై సంతకాలు పెట్టించుకున్న దృశ్యాలను వీడియో చిత్రీకరించినట్టు పోలీసులు నిర్ధారించారు.

రాకేశ్ రెడ్డితో వివాదాలు ఉన్న నేపథ్యంలో తెలిసి మరీ ఆయన ఇంటికి  జయరాం ఎలా వెళ్లారన్న చిక్కు ప్రశ్న ముడిని కూడా పోలీసులు తాజాగా విప్పారు. గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని వీణ ఇటికి తీసుకెళ్తున్నట్టు జయరాంను ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి స్నేహితుడు కిశోర్ నమ్మించాడు.

కారు రాకేశ్ రెడ్డి ఇంట్లోకి వెళ్తున్నట్టు జయరాం చివరి నిమిషంలో గ్రహించి అప్రమత్తమయ్యాడు. అయితే, అప్పటికే ఆలస్యమైంది. అప్పటికే అక్కడ రాకేశ్ రెడ్డి ఎదురుచూస్తుండడంతో తప్పించునే మార్గం లేకుండా పోయింది. అయితే, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామనుకున్నప్పటికీ, ఆ అవకాశాన్ని రాకేశ్ ఆయనకు ఇవ్వలేదని పోలీసులు తేల్చారు.

Chigurupati Jayaram
Rakesh Reddy
Kishore
Veena
Hyderabad
  • Loading...

More Telugu News