P Ravindra Babu: మరో ఫిరాయింపు... నేడో, రేపో వైసీపీలోకి అమలాపురం ఎంపీ!

  • ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పెరిగిన ఫిరాయింపులు
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసలు
  • నేడో, రేపో జగన్ ను కలవనున్న పీ రవీంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫిరాయింపులు పెరిగాయి. కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపిస్తుండగా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ లు టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

తాజాగా, అమలాపురం లోక్ సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను పార్టీ మారడం లేదని ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ, కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. నేడో, రేపో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ను రవీంద్రబాబు కలవనున్నారని, ఆపై ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకుంటారని సమాచారం.

P Ravindra Babu
Amalapuram
Jagan
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News