Alfons Kannan: అమరవీరుడి ముందు కేంద్ర మంత్రి సెల్ఫీ... కడిగిపారేస్తున్న నెటిజన్లు!

  • ఆత్మాహుతి దాడిలో అమరుడైన వసంతకుమార్
  • అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
  • శవపేటిక ముందు అల్ఫోన్స్ కన్నన్ సెల్ఫీ

ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో అమరుడైన ఓ సీఆర్పీఎఫ్ జవాను శవపేటిక ముందు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నన్ సెల్ఫీ దిగడంతో పాటు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అమరవీరుడు వసంతకుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సాగుతున్న వేళ, నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన, సెల్ఫీలు దిగడం ఏంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కనీస బాధ్యతను మరిచి ఇలా చేయడం తగదని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలపై అల్ఫోన్స్ స్పందిస్తూ, తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నానని, తన తండ్రి కూడా సైనికుడేనని అన్నారు. ఓ సైనికుడు అమరుడైతే ఎంత బాధ కలుగుతుందో తనకు తెలుసునని చెప్పారు. అయితే, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టి, విమర్శలకు గురికావడం అల్ఫోన్స్ కు ఇదే తొలిసారేమీ కాదు. గత సంవత్సరం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ఆశ్రయం పొందుతున్న బాధితులను కలిసిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగి పోస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధమైన విమర్శలు వెల్లువెత్తాయి.

Alfons Kannan
Selfy
Sucide Attack
Vasant Kumar
  • Loading...

More Telugu News