Talasani: తలసానిపై అచ్చెన్నాయుడు ఫైర్.. ఆయన స్థానంలో తానుంటే రైలు కింద తలపెట్టేవాడినన్న మంత్రి

  • 25 కులాలను బీసీల్లో చేరిస్తే నోరెత్తని తలసానికి మాట్లాడే అర్హత లేదు
  • మేమేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదు
  • ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోం

ఏపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తరచూ విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగితే కేసీఆర్‌ను నిలదీయడం చేతకాని తలసాని ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

తెలంగాణలో 25 కులాలను ఓబీసీల్లో చేర్చితే నిలదీయడం చేతకాని తలసాని స్థానంలో తానుంటే రైలు కింద తలపెట్టేవాడనన్నారు. తామేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోనని తలసానిని హెచ్చరించారు. కాగా, ఇటీవల రెండుసార్లు ఏపీకి వెళ్లిన తలసాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.  

Talasani
Telangana
OBC
Andhra Pradesh
atchannaidu kinjarapu
  • Loading...

More Telugu News