Bonda Uma: అవంతికి నిజం తెలిసొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది: బొండా ఉమ

  • మంత్రి కావాలన్నది అవంతి శ్రీనివాస్ కల
  • కలలు కల్లలు కానున్నాయి
  • మళ్లీ గెలిచేది టీడీపీయేనన్న బొండా ఉమ

ఎలాగైనా మంత్రిని కావాలన్న కలతోనే అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయన కలలు కల్లలేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అవంతికి నిజం తెలిసొచ్చే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘన విజయం ఖాయమని, మరోసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారని ఉమ వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి లేకుంటే తాను ఎక్కడ ఉండేవాడినన్న విషయం అవంతికి బాగా తెలుసునని, ఇష్టం వచ్చినట్టు తమ పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Bonda Uma
Avanti Srinivas
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News