YSRCP: బీసీలకు టీడీపీ ఏం చేయలేదో జగన్ నిరూపించాలి: మంత్రి అచ్చెన్నాయుడు

  • బీసీల కోసం రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టాం
  • టీడీపీ అంటే బీసీలు, బీసీలంటే తెలుగుదేశం
  • చంద్రబాబు హయాంలోనే బీసీలకు స్వర్ణయుగం

వైసీపీ అధినేత జగన్ ఈరోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదంటూ జగన్ విమర్శించారు. ఈ విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. బీసీలకు టీడీపీ ఏం చేయలేదో జగన్ నిరూపించాలని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో బీసీల కోసం రూ.42 వేల కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, టీడీపీ అంటే బీసీలు, బీసీలంటే తెలుగుదేశం అని అన్నారు. చంద్రబాబు హయాంలోనే బీసీలకు స్వర్ణయుగమని చెప్పిన అచ్చెన్నాయుడు, బడ్జెట్ లో బీసీలకు రూ.3 వేల కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. నవరత్నాలను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు బీసీలను మోసగించేందుకే వైసీపీ ‘బీసీ గర్జన’ సభ నిర్వహించిందని విమర్శించారు.   

YSRCP
jagan
Telugudesam
atchanaidu
navaratnalu
  • Loading...

More Telugu News