Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకం ‘అన్నదాత సుఖీభవ’ సాయంపై జీవో విడుదల

  • రైతులకు పెట్టుబడి సాయం ‘అన్నదాత సుఖీభవ’
  • తొలి విడతగా ఇచ్చే మొత్తం రూ.4 వేలు
  • ఇందులో కొంత మొత్తం జమ చేయనున్న ప్రభుత్వం

రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం ద్వారా పెంచిన మొత్తాన్ని ఈ జీవోలో ప్రస్తావించింది.. అందుబాటులో ఉన్న మంత్రుల సంతకాలను తీసుకుని ఈ జీవోను విడుదల చేసింది. ఈ పథకం కింద తొలి విడతగా ఇస్తామన్న నాలుగు వేల రూపాయల్లో మొదట దఫాగా కొంత నగదును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొంత నగదును జమ చేయనుంది. కాగా, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.9 వేలతో పాటు కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కలిపి మొత్తం రూ.15 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు నిన్న ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 54 లక్షల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రయోజనం పొందనున్నారు.

Andhra Pradesh
annadata sukhibhava
Chandrababu
  • Loading...

More Telugu News