YSRCP: మా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి: వైఎస్ జగన్ ప్రకటన

  • ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 22న నోటిఫికేషన్ రానుంది
  • వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవి వస్తుంది

ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరులో నిర్వహించిన వైసీపీ ‘బీసీ గర్జన’ సభలో జగన్ మాట్లాడుతూ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ నెల 22న నోటిఫికేషన్ రానున్నట్టు చెప్పారు. టీడీపీకి నాలుగు పదవులు వస్తుండగా, వైసీపీ ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవి మాత్రమే వస్తోందని అన్నారు. వైసీపీకి వచ్చే ఒకేఒక్క ఎమ్మెల్సీ పదవిని జంగా కృష్ణమూర్తికి ఇవ్వనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. కాగా, బీసీ సమస్యల అధ్యయన కమిటీలో జంగా కృష్ణమూర్తి కీలకంగా వ్యవహరించారు.

YSRCP
Jagan
janga krishna murthy
ap
eluru
  • Loading...

More Telugu News