Uttar Pradesh: అయోధ్యలో రామాలయం శంకుస్థాపన.. 144 సెక్షన్ విధించిన యూపీ పోలీసులు!

  • శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పాదయాత్ర
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
  • ఒకే రోడ్డులో ట్రాఫిక్ ను అనుమతిస్తున్న పోలీసులు

రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పాదయాత్రకు సిద్ధమయ్యారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో 144 సెక్షన్ విధించింది. దీంతో బృందాలుగా వచ్చే వారిని వివాదాస్పద స్థలం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంతంవైపు వెళ్లేందుకు ఒకే దారిలో ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈరోజు రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని కొన్ని హిందూ సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో అధికారుటు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.

Uttar Pradesh
ayodhya
ram temple
144 section
  • Loading...

More Telugu News