puducheri: కిరణ్ బేడీ తీరుపై పుదుచ్చేరి సీఎం నిరసన.. నల్లజెండా ఎగరవేసిన వైనం

  • నారాయణ స్వామి తన నివాసంపై నల్లజెండా ఎగురవేత
  • కిరణ్ బేడీ వల్ల రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయి
  • కేంద్రం ఆమెను రీకాల్ చేయాలంటూ డిమాండ్

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీరుపై ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడుతున్నారు. కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ ఐదు రోజుల క్రితం ఆయన చేపట్టిన ధర్నా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నారాయణ స్వామి తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. కిరణ్ బేడీ వల్ల పుదుచ్చేరిలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆమె జారీ చేసిన ఆదేశాలను ఆయన ప్రస్తావించారు. హెల్మెట్ వాడకంలో ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, అప్పటి వరకు దశలవారీగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

puducheri
kiran bedi
cm
narayana swamy
  • Loading...

More Telugu News