Chandrababu: చంద్రబాబువి ఓటు బ్యాంక్ రాజకీయాలు: వైసీపీ నేత బొత్స

  • చంద్రబాబుకు నాలుగేళ్లుగా బీసీలు గుర్తురాలేదు
  • ఎన్నికల సమయంలోనే వాళ్లు ఆయనకు గుర్తొచ్చారు!
  • బీసీలు ఎదిగేలా ‘బీసీ డిక్లరేషన్‘ ఉంటుంది

చంద్రబాబువి ఓటు బ్యాంక్ రాజకీయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైసీపీ నిర్వహిస్తున్న బీసీ గర్జన సభకు ఆయన హాజరయ్యారు. ఈ  సందర్భంగా బొత్స మాట్లాడుతూ, చంద్రబాబుకు నాలుగేళ్లుగా బీసీలు గుర్తురాలేదని, ఇప్పుడే ఆయనకు వారు గుర్తొచ్చారని విమర్శించారు. ఎన్నికల వేళ చంద్రబాబుకు బీసీలు గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే తమ పార్టీ అధినేత జగన్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. జగన్ తన పాదయాత్రలో బీసీ సమస్యలను గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని రంగాల్లో బీసీలు ఎదిగేలా బీసీ డిక్లరేషన్ ఉంటుందని అన్నారు.

Chandrababu
Telugudesam
botsa
YSRCP
eluru
  • Loading...

More Telugu News