Guntur District: కొండవీడు కోట ఉత్సవాలు.. తరలివస్తున్న సందర్శకులు
- కొండవీడు కోట ప్రాముఖ్యత చాటి చెప్పేలా ఉత్సవాలు
- రెండ్రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
- గుంటూరు, చిలకలూరిపేట నుంచి ప్రత్యేక బస్సులు
గుంటూరు జిల్లాలోని కొండవీడు కోట ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలు చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కొండవీడు కోట ప్రాముఖ్యత చాటి చెప్పేలా నిర్వహించనున్న ఈ ఉత్సవాలు రెండ్రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి.
తెలుగు సంస్కృతి, వారసత్వం చాటి చెప్పేలా ఈ ఉత్సవాలు వుంటాయి. గ్రామీణ ప్రజల కోసం కొండపైన క్రీడలు నిర్వహించనున్నారు. కొండవీడు ఉత్సవాల నిమిత్తం గుంటూరు, చిలకలూరిపేట నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కొండపైకి చేరుకునేందుకు ఉచిత బస్సు సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ ఉత్సవాలకు సుమారు రెండు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. కాగా, రేపటి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.