Andhra Pradesh: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్.. ఘనస్వాగతం పలికిన వైసీపీ నేతలు!

- ఏలూరులో నేడు బీసీ గర్జన సభ
- డిక్లరేషన్ ప్రకటించనున్న జగన్
- సభాస్థలికి కారులో ప్రయాణం
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఈరోజు ‘బీసీ గర్జన’ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సభ వేదికపై నుంచే వైసీపీ అధినేత జగన్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమం కోసం చేపట్టే చర్యలను జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
