Sakshi Maharaj: జవాన్ అంతిమయాత్రలో నవ్వుతూ పాల్గొన్న బీజేపీ ఎంపీ... ఎండగడుతున్న నెటిజన్లు!

  • ఉగ్రదాడిలో మరణించిన అజిత్ కుమార్
  • అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తన
  • ఆటాడుకుంటున్న నెటిజన్లు

శ్రీనగర్ సమీపంలోని అవంతిపురా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ అజిత్‌ కుమార్‌ అంతిమ యాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ, అంతిమయాత్ర వాహనంపై నవ్వుతూ కనిపించడం, ఉత్సాహంగా చేతులు ఊపుతూ అభివాదం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అజిత్‌ కుమార్‌ అంత్యక్రియలు ఉన్నావ్ లో జరుగగా, స్ధానిక ఎంపీ హోదాలో సాక్షి మహరాజ్‌ వాహనం ఎక్కారు. ఆపై నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

అజిత్ కు నివాళులు అర్పించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చిన వేళ, సాక్షి మహరాజ్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ అమర వీరుడి అంతిమయాత్ర వాహనంపై నిలబడి ఇలా అభివాదాలు చేయడం సరైన చర్య కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతిమయాత్రను ఆయన అభినందన యాత్రగా భావించినట్టున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

Sakshi Maharaj
BJP
Ajit Kumar
  • Loading...

More Telugu News