Sucide: స్వస్థలానికి వెళ్లిపోదామన్న భార్య.. ఒప్పుకోని భర్త.. యువతి ఆత్మహత్య!

  • రామాంతపూర్ లో ఓడిశా దంపతులు
  • హైదరాబాద్ లో ఉండలేనని చెప్పిన భార్య
  • భర్త కాదనడంతో ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో ఉండటం తన వల్ల కావడం లేదంటూ వివాహిత యువతి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిన్న జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒడిశాకు చెందిన సంతోష్ ఠాగూర్ అనే ప్రైవేటు ఉద్యోగి, రామాంతపూర్‌, సాయికృష్టా కాలనీలో తన భార్య ప్రియాంకా కుమారితో (27)తో కలిసి వుంటున్నాడు. వీరికి మూడేళ్ల బాబు, తొమ్మిది నెలల పాప ఉన్నారు.

గత కొంతకాలంగా ప్రియాంక, స్వస్థలానికి వెళ్లిపోదామని పదేపదే పోరు పెడుతోంది. అయితే, ఉపాధి కరవవుతుందన్న కారణంతో సంతోష్ నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె, నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Sucide
Marriage Lady
Hyderabad
Ramantapur
  • Loading...

More Telugu News