Rawalpindi: రోగానికి చికిత్స పొందుతూనే... ఉగ్రవాదులకు మసూద్ అజర్ ఆదేశాలు!

  • రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స
  • పుల్వామా దాడికి 8 రోజుల ముందు సందేహం
  • ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపు

ప్రస్తుతం పాకిస్థాన్, రావల్పిండిలోని ఓ ఆసుపత్రిలో తనకున్న ప్రాణాంతక రోగానికి చికిత్స పొందుతూనే, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, పుల్వామా ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్ పై దాడికి ప్రణాళికలు రూపొందించి, తన శిష్యగణం ద్వారా అమలు చేయించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి.

దాడికి వారం రోజులకు ముందుగానే మసూద్ నుంచి ఓ ఆడియో సందేహం ఉగ్రవాదులకు అందింది. ఓ ఉగ్రవాదిని ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసిన తరువాత, అటాక్ కు పురమాయిస్తూ, తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని, ఈ దాడికి ప్లాన్ చేశాడు. అతని సూచన మేరకే అబ్దుల్ రషీద్ ఘాజీ భారీ బాంబును తయారు చేసి ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ లో అమర్చాడు.

కాగా, గత నాలుగు నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్న మసూద్ అజర్, గడచిన ఆరు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనలేదు. ఇండియాపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్న మసూద్, పుల్వామా టెర్రర్ దాడికి ఎనిమిది రోజుల ముందు యాక్టివ్ అయ్యాడు. ఉగ్రవాదులకు ఇచ్చిన ఆడియో సందేశంలో, ఈ యుద్ధంలో మరణానికి మించిన గౌరవం మరొకటి లేదని కూడా మసూద్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News