Ajay Devagan: శంకర్ అడిగాడు, రాజమౌళి అడగలేదు: అజయ్ దేవగణ్

  • భారతీయుడు-2లో అజయ్ విలన్ అని వార్తలు
  • శంకర్ సంప్రదించాడు, నాకు కుదరలేదు
  • రాజమౌళి అసలు అడగనేలేదు 

అజయ్ దేవగణ్... బాలీవుడ్ స్టార్ హీరో. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమలహాసన్ తో 'భారతీయుడు-2'కు ప్లాన్ చేశాడు శంకర్. ఇదే సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ అజయ్ దేవగణ్ యాక్ట్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో తన వివరణ ఇచ్చాడు అజయ్ దేవగణ్. 'భారతీయుడు-2'లో విలన్ పాత్రను పోషించాలని శంకర్ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నాడు. అయితే, తాను 'తానాజీ' సినిమాతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని అంగీకరించలేక పోయానని అన్నాడు. ఇదే సమయంలో 'ఆర్ఆర్ఆర్'లో తాను నటిస్తున్నానన్న వార్తలపై స్పందిస్తూ, రాజమౌళి ఇంతవరకూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశాడు. తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవమూ లేదని చెప్పాడు. 

Ajay Devagan
Rajamouli
Shankar
Bharateeyudu-2
RRR
  • Loading...

More Telugu News