Australia: ఇలాంటి క్యాబేజీని ఎక్కడా చూసుండరు!

  • ఆస్ట్రేలియాలో అద్భుతం
  • భారీ క్యాబేజిని పండించిన స్థానిక రైతు
  • సైజు చూస్తే బేజారే

సాధారణంగా క్యాబేజి బరువు ఎంత ఉంటుంది?... మహా అయితే కేజీ, ఒక్కోసారి రెండు కేజీల వరకు ఉంటుందేమో! పట్టుకుంటే ఒక్క చేతిలో ఇమిడిపోతుంది. కానీ ఈ ఆస్ట్రేలియన్ దంపతులు పండించిన క్యాబేజీని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఓ మనిషి సైజులో ఉండే భారీ క్యాబేజి ప్రపంచ మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆస్ట్రేలియాలోని జాకీస్ మార్ష్ ప్రాంతంలో నివసించే రోజ్ మేరీ నార్వుడ్, షాన్ కాడ్మన్ దంపతులు ఈ క్యాబేజి కొండను ఎంతో కష్టపడి పండించారు. దాదాపు తొమ్మిది నెలలకు పైగా ఎంతో శ్రద్ధగా, తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అతి భారీ క్యాబేజీని పెంచారు.

గతేడాది ఏప్రిల్ లో ఈ క్యాబేజిని పెంచడం మొదలుపెట్టిన రోజ్ మేరీ దంపతులు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ దంపతులు జెయింట్ క్యాబేజీని పండించడంపై ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం విశేషం అని చెప్పాలి. సకాలంలో వర్షాలు పడడంతో పాటు వేసవి ఆరంభంలో చురుక్కుమనేలా ఎండలు కాయడం కూడా క్యాబేజి పెంపకానికి తోడ్పడిందని రోజ్ మేరీ తెలిపింది. ఇక ఆ క్యాబేజీ మొక్కకు సమీపంలో ఉండే ఇతర క్యాబేజీలను రోజ్ మేరీ, కాడ్మన్ ఎప్పటికప్పుడు తుంచివేస్తూ భారీ క్యాబేజీని పండించారు. ఇక ఈ క్యాబేజ్ తో ఓ ఇంటివాళ్లకు రెండు వారాల పాటు ఆహార అవసరాలు తీర్చవచ్చట.

  • Loading...

More Telugu News