rashmi: 'ఏంట్రా, నీ పాకిస్థాన్ గొప్పతనం' అంటూ మండిపడిన యాంకర్ రష్మీ
- ఆయన పాకిస్థాన్ వెళ్లిపోవలసింది
- మాతోనే నీ అస్తిత్వమని మరిచిపోకు
- దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా?
ఇటీవల 'పుల్వామా'లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భారతీయులంతా తమ జవాన్ల వీరమరణానికి నీరాజనాలు సమర్పిస్తూనే, పాకిస్థాన్ వైఖరిపట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అమానుషమైన చర్యకి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేయవలసిందేననీ, మరోసారి సర్జికల్ స్ట్రైక్ తో ప్రతీకారం తీర్చుకోవలసిందేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత్ లోనే ఉంటూ కొందరు పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటివారిపై కూడా నెటిజన్లు మండిపడివుతున్నారు. మాజీ క్రికెటర్ 'సిద్ధూ' మాట్లాడుతూ "ఉగ్రవాదానికి దేశంతో గానీ .. మతంతో గాని సంబంధం లేదు" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ విషయంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ .. 'పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడుతోన్న సిద్ధూ .. దేశ విభజన సమయంలో అక్కడికే వెళ్లిపోవలసింది. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయారు' అంటూ అసహనాన్ని ప్రదర్శించింది. ఇక 'పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్' అంటూ షోయెబ్ హఫీజ్ అనే నెటిజన్ ట్వీట్ కి రష్మీ స్పందిస్తూ ..'సాలే .. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం? .. మాతోనే నీ అస్తిత్వం .. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా? మూసుకుని కూర్చో .. లేదంటే పాకిస్థాన్ కి వెళ్లిపో' అంటూ మండిపడింది.