ram charan: మొదట్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మాకు పరిచయం ఏర్పడింది: ఉపాసన

  • కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది
  • ఇద్దరి మధ్య ఏదో బలమైన బంధం ఉందనిపించింది
  • అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం

మొదట్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తాను, రామ్ చరణ్ కలుసుకున్నామని ఉపాసన తెలిపారు. అవి ఇద్దరం కెరీర్ ప్రారంభించిన తొలి రోజులని... రానురాను తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. కెరీర్ పరంగా ఒకర్నొకరు అభినందించుకునేవారమని... ఇద్దరి మధ్య ఏదో బలమైన బంధం ఉందని అనిపించిందని... ఆ నేపథ్యంలో, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తన భర్త చరణ్ ఎంతో సహనంతో ఉంటారని... ఆయన నుంచే సహనంగా ఉండటాన్ని తాను నేర్చుకున్నానని చెప్పారు. ఇద్దరి మధ్య స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని... వృత్తి పరంగా ఒకరి విషయాల్లో మరొకరం కల్పించుకోమని తెలిపారు. తమతో పాటే పనిని కూడా ఇంటికి వెంటబెట్టుకుని వెళ్లమని చెప్పారు. తాజాగా ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

ram charan
upasana
marriage
tollywood
  • Loading...

More Telugu News