modi: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమర జవాను భార్య!

  • మోదీ మాటలను నమ్మలేం
  • భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వడం లేదు?
  • ఆ నిర్లక్ష్యమే తాజా మారణహోమానికి కారణమైంది

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన జవాను ప్రదీప్ సింగ్ కుటుంబసభ్యులు ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాటలను, ప్రభుత్వ చేతలను నమ్మలేమని ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ అన్నారు. గతంలో కూడా కశ్మీర్ లో ఉగ్రదాడులు జరిగాయని... అయినా, భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛను ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యమే తాజా మారణహోమానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రదీప్ సింగ్ తండ్రి మాట్లాడుతూ, జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎప్పుడూ గౌరవించలేదని... జవాన్ల త్యాగాలను ప్రజలు రెండు, మూడు రోజుల్లో మర్చిపోతారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందని... కానీ, ఉగ్రదాడులు మాత్రం ఆగిపోలేదని అన్నారు. ప్రదీప్ సోదరుడు మాట్లాడుతూ, తన సోదరుడి ప్రాణాల కంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం విలువైంది కాదని చెప్పారు.

modi
jawan
padeep singh
family
comments
  • Loading...

More Telugu News