shabana azmi: మీ దేశానికి మేము రావడం లేదు: షబానా అజ్మీ, జావెద్ అఖ్తర్

  • ఈనెల 23, 24 తేదీల్లో కరాచీలో కల్చరల్ ప్రోగ్రామ్
  • తాము రావడం లేదని తెలిపిన బాలీవుడ్ జంట
  • భవిష్యత్తులో కూడా ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం

సీఆర్ఫీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశంతో ఉన్న ఒప్పందాలన్నింటినీ తెగదెంపులు చేసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు, పాక్ లోని కరాచీలో ఈనెల 23, 24 తేదీల్లో కైఫీ అజ్మీ కల్చరల్ ప్రోగ్రామ్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ జంట షబానా అజ్మీ, జావెద్ అఖ్తర్ లు హాజరుకావాల్సి ఉంది. ఉగ్రదాడికి నిరసనగా ఈ కార్యక్రమానికి తాము రావడం లేదని వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో పాక్ లో జరిగే ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News