Andhra Pradesh: వైసీపీలో చేరిన నంద్యాల ‘ఇరిగెల బ్రదర్స్’.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-9c809c78db93d3152359f3da8a83e12912c35307.jpg)
- ఇద్దరిని లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన శిల్పా మోహన్ రెడ్డి
- వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిన నంద్యాల నేతలు
- సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత
టీడీపీ మాజీ నేతలు ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఈరోజు వైసీపీలో చేరారు. నంద్యాల నేత శిల్పా మోహన్ రెడ్డితో కలిసి ఈరోజు హైదరాబాద్ లోని జగన్ నివాసానికి వీరిద్దరూ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జగన్.. పార్టీ కండువా కప్పి వీరిద్దరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-7c816280c354bccd639c0d94fc3be29a69e123b8.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-4241bb56750a8f30be27f2c3b9c99e849a7b52c1.jpg)