Andhra Pradesh: అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన విజయ్ దేవరకొండ!

- భారత్ కే వీర్ వెబ్ సైట్ ద్వారా విరాళం
- మిగతా సెలబ్రిటీలూ ముందుకు రావాలన్న నటుడు
- సైనికుల జీవితాలను డబ్బులతో వెల కట్టలేమని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గత గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదులకు, వారికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం స్పందించాడు. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి ఓ అడుగు ముందుకు వేసి మిగతా నటీనటులకు, సెలబ్రిటీలకు స్ఫూర్తిగా నిలిచాడు.
