tarun bhaskar: నటించడం చాలా కష్టమనే విషయం అర్థమైంది: దర్శకుడు తరుణ్ భాస్కర్

  • దర్శకత్వానికే తొలి ప్రాధాన్యత
  • నటుడిగా వరుస అవకాశాలు
  • ఈ నెల 22న 'మిఠాయి' విడుదల

'పెళ్లిచూపులు' సినిమాతో తరుణ్ భాస్కర్ తన సత్తా చాటుకున్నాడు. ఈ సమయంలో ఆయనని చూసినప్పుడే, నటుడిగా కూడా ట్రై చేయవచ్చుగదా అని చాలామంది అనుకున్నారు. ప్రస్తుతం ఆయన నటుడిగా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా 'మిఠాయి' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ .. "నేను పూర్తిగా నటన వైపుకి వచ్చేశానని అంతా అనుకుంటున్నారు. కానీ ఒకదాని తరువాత ఒకటిగా అవకాశాలు వస్తుండటంతో చేస్తున్నాను. నటుడిగా మారడం వలన నటించడం ఎంత కష్టమనేది తెలిసింది. నా తొలి ప్రాధాన్యత దర్శకత్వానికే .. తదుపరి సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక 'మిఠాయి' సినిమా ఈ నెల 22వ తేదీన విడుదలకానుంది. దర్శకుడు ప్రశాంత్ కుమార్ చాలా బాగా తీశాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 

tarun bhaskar
  • Loading...

More Telugu News