Telugudesam: వైసీపీలోకి ఆళ్లగడ్డ టీడీపీ మాజీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి.. నేడు జగన్‌తో భేటీ

  • మంత్రి అఖిలప్రియతో విభేదాలు
  • గత నెలలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
  • జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం

మంత్రి అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ మాజీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో నేడు ఇరిగెల భేటీ కానున్నారు.

టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే, మంత్రి అఖిలప్రియతో ఉన్న విభేదాల కారణంగా పార్టీకి దూరం జరిగారు. గతేడాది డిసెంబరు 28న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీలో చేరనున్నారు.

Telugudesam
YSRCP
Jagan
Akhila priya
Irigela ram pulla reddy
Kurnool District
  • Loading...

More Telugu News