Hyderabad: ప్రేమికుల రోజున పార్క్‌లో బలవంతపు పెళ్లి.. అవమానంతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమ జంట.. కాపాడిన పోలీసులు!

  • వాలెంటైన్స్ డే రోజున కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో కనిపించిన జంట
  • బలవంతంగా పెళ్లి చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
  • మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన జంట

ప్రేమికుల రోజున మేడ్చల్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలకు చిక్కి.. బలవంతపు పెళ్లి చేసుకున్న ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఘటన జరిగిన దగ్గరి నుంచి ముఖం చూపించలేక తీవ్ర మనస్తాపానికి గురైన జంట శుక్రవారం సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, వెంటనే అప్రమత్తమైన లేక్ పోలీసులు వారిద్దరినీ కాపాడారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో కనిపించిన బాధిత జంటను చూసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. విషయం తెలిసిన యువతి తండ్రి భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగినప్పటి నుంచి తన కుమార్తె కనిపించడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయిందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.  

Hyderabad
Medchal
Kandlakoya
Oxygen park
Lovers
Hussain sagar
  • Loading...

More Telugu News