Jagan: జగన్ లండన్ వెళ్లేందుకు లైన్ క్లియర్.. కోర్టు షరతులతో కూడిన అనుమతి

  • లండన్‌లో చదువుకుంటున్న జగన్ కుమార్తె
  • చూసి వచ్చేందుకు అనుమతి కోరిన జగన్
  • తనకూ అనుమతి కావాలన్న విజయసాయి రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 18 నుంచి మార్చి 15 మధ్య పది రోజుల పాటు జగన్ లండన్‌లో పర్యటించేలా ఏడాది కాలపరిమితితో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే, లండన్‌లో జగన్ పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్‌ఫోన్, సెల్ నంబరు, ఈ-మెయిల్, ఫ్యాక్స్ నంబర్లను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.

అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2 నిందితుడైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. విజయసాయి పిటిషన్‌ను కోర్టు సోమవారం విచారించనుంది.

Jagan
YSRCP
vijayasai reddy
London
CBI Court
Hyderabad
  • Loading...

More Telugu News