Andhra Pradesh: సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్

  • ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా
  • సోమిరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన షరీఫ్
  • ఇష్ట పూర్వకంగానే రాజీనామా చేశానన్న సోమిరెడ్డి

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోమిరెడ్డి రాజీనామాను శాసన మండలి చైర్మన్ షరీఫ్ ఆమోదించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డితో ఆయన ఫోన్ లో మాట్లాడారు. తన ఇష్ట పూర్వకంగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు షరీఫ్ తో సోమిరెడ్డి చెప్పారు. దీంతో, సోమిరెడ్డి రాజీనామాకు షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా చేశారు.

Andhra Pradesh
somireddy
mlc
chairman
sharif
Nellore District
surveypalli
  • Loading...

More Telugu News