Jammu Kashmir: అమరుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం.. ఒకరికి ఉద్యోగం ప్రకటించిన యూపీ సీఎం యోగి
- అమర జవాన్లలో ఎక్కువ మంది యూపీ వారే
- రహదారులకు అమర జవానుల పేర్లు
- అమరుల్లో ఎక్కువ మంది యూపీ వారే
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమ రాష్ట్రానికి చెందిన జవాన్ల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిహారం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు.. బాధిత కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, బాధిత కుటుంబాల స్వగ్రామాల వైపు వెళ్లే రహదారులకు అమర జవానుల పేర్లను పెట్టనున్నట్టు యోగి ప్రకటించారు. అమరులైన వారిలో ఎక్కువ మంది (12) జవాన్లు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడంతో యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.