Karan Johar: తనను ఎగతాళి చేసిన మహిళకు గట్టి కౌంటర్ ఇచ్చిన కరణ్ జొహార్

  • ఏదన్నా పని చేసుకోండి
  • దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి
  • పిల్లలకు దక్కాల్సిన ప్రేమ దక్కుతోంది

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ మంచి మాటకారి. కౌంటర్లు ఇవ్వడంలో దిట్ట. అలాగే తాజాగా తనను ఎగతాళి చేసిన ఓ మహిళకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఓ మహిళ ఆయనపై చేసిన కామెంట్స్‌తో నొచ్చుకున్న కరణ్ ఆమెకు దీటుగా బదులిచ్చారు. రెండేళ్ల క్రితం కరణ్ సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడు. అయితే ఆ కవలలకు కరణ్ తల్లి ప్రేమను దూరం చేస్తున్నాడంటూ ఓ మహిళ ట్వీట్ చేసింది.

దీనిపై స్పందించిన కరణ్.. 'తన పిల్లలకు తల్లి ఉందని, ఇంకా చెప్పాలంటే తన తల్లే తన పిల్లలకు కూడా తల్లని..' జవాబిచ్చాడు. ‘మేడమ్‌.. ఇలాంటి మాటలు చెప్పి సమయం వృథా చేసుకునే బదులు ఏదన్నా పనిచేసుకోండి. దేశంలో పట్టించుకోవాల్సిన వేరే చాలా ఉన్నాయి. నా పిల్లలకు దక్కాల్సిన ప్రేమ దక్కుతోంది. నాకు అది చాలు. వారికీ తల్లి ఉంది. మా అమ్మే నా పిల్లలకీ తల్లి. అర్థమైందా?’ అంటూ బదులిచ్చాడు. అన్నట్టు, రెండేళ్ల క్రితం సరోగసీ ద్వారా కరణ్ కవల పిల్లలకు తండ్రి అయ్యాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News