praja rajyam: నాడు నేను ‘ప్రజారాజ్యం’లోకి వెళ్లే ముందు చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయలేదు: అవంతిపై గంటా ఫైర్

  • చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్ ఆరోపణలు తగదు
  • బాబును ‘కాపుమిత్ర’ అని అవంతి ప్రశంసించలేదా?
  • ఇప్పుడు, ఆయన్ని కాపు వ్యతిరేకి అంటారా?

ఇన్నాళ్లూ టీడీపీలో ఉండి, తమ పార్టీని వీడిన మరుక్షణమే సీఎం చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. చంద్రబాబుపై అవంతి చేసిన ఆరోపణలు, విమర్శలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. గతంలో తాను ప్రజారాజ్యంలోకి వెళ్లే ముందు చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదని గుర్తుచేసుకున్నారు.

చంద్రబాబుపైన, పార్టీపైన అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని అన్నారు. చంద్రబాబును ‘కాపుమిత్ర’ అని ప్రశంసించిన అవంతి శ్రీనివాస్, ఇప్పుడు, ఆయన్ని కాపు వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అవంతి కోసం భీమిలి నియోజకవర్గాన్ని సైతం వదులుకోవడానికి తాను సిద్ధపడ్డానని, అయినప్పటికీ, పార్టీని ఆయన వీడారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ బయటకు వెళ్లారని ఆరోపించారు.

praja rajyam
Telugudesam
ganta
srinivas rao
avanti
  • Loading...

More Telugu News