rajnath singh: సీఆర్పీఎఫ్ జవాన్ శవపేటికను మోసిన రాజ్ నాథ్ సింగ్!
- ఉగ్రదాడిలో 40 మందికి పైగా అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లు
- బద్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపుకు వెళ్లిన రాజ్ నాథ్
- డీజీపీ దిల్బాగ్ సింగ్ తో కలసి శవపేటికను మోసిన కేంద్ర హోంమంత్రి
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్ కు వెళ్లారు. బద్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ఓ అమరవీరుడి శవపేటికను భుజాలపై మోశారు. రాజ్ నాథ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ లతో పాటు ఇతర అధికారులు శవపేటికను మోసి, అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ విషణ్ణ వదనంతో కనిపించారు. మరోవైపు 'వీర్ జవాన్ అమర్ రహే' అనే నినాదాలతో సీఆర్పీఎఫ్ క్యాంప్ మారుమోగింది.
#WATCH: Home Minister Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier in Budgam. #PulwamaAttack pic.twitter.com/CN4pfBsoVr
— ANI (@ANI) February 15, 2019