pakistan high commissioner: పాకిస్థాన్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన ఇండియా
- సొహైల్ మహ్మూద్ ను పిలిపించుకున్న విజయ్ గోఖలే
- పుల్వామా ఘటనపై నిరసన వ్యక్తం చేసిన విదేశాంగ కార్యదర్శి
- జైషే మొహమ్మద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ హైకమిషనర్ సొహైల్ మహ్మూద్ కు భారత్ సమన్లు జారీ చేసింది. మహ్మూద్ ను భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించుకున్నారు. పుల్వామాలో జరిగిన ఘటనపై ఈ సందర్భంగా తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. జైషే మొహమ్మద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్ గడ్డపై నుంచి పని చేస్తున్న టెర్రరిస్టు సంస్థలను, వాటికి సహకరిస్తున్న వ్యక్తులను అణచివేయాలని సూచించారు.
#WATCH Delhi: Pakistan High Commissioner to India Sohail Mahmood(on the left) leaves from MEA. He had been summoned by Foreign Secretary Vijay Gokhale. #PulwamaAttack pic.twitter.com/0on0k0bPNX
— ANI (@ANI) February 15, 2019