katta rambabu: టాలీవుడ్ నిర్మాత కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు

  • కట్టా రాంబాబు కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు
  • భర్త, మామ వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి, విచారిస్తున్న పోలీసులు

అదనపు కట్నం వేధింపులు సామాన్యులకే కాదు సంపన్నులకు కూడా తప్పడం లేదు. టాలీవుడ్ సినీ నిర్మాత కట్టా రాంబాబు కుమార్తె రమ్య అదనపు కట్నం వేధింపులపై హోసూరులో ఫిర్యాదు చేసింది. హైదరాబాదుకు చెందిన కట్టా రాంబాబు 'కుర్రాడు', 'అనగనగా' తదితర సినిమాలను నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరైన రమ్యను హోసూరులో నివాసముంటున్న ఆడిటర్ కృష్ణారావు కుమారుడు రాకేష్ చౌదరికి ఇచ్చి వివాహం చేశారు. 2013లో వీరి వివాహం విజయవాడలో ఘనంగా జరిగింది. వివాహం సమయంలో రూ. 4 కోట్లు కట్నం ఇచ్చారు.

పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ మూడేళ్లపాటు హోసూరులో ఉండి, ఆ తర్వాత బెంగళూరుకు మారారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా మరో రూ. 5కోట్లు కట్నంగా తీసుకురావాలని రమ్యకు వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హోసూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తన భర్త, ఆయన తండ్రి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

katta rambabu
tollywood
producer
daughter
dowry
harassment
ramya
bengaluru
  • Loading...

More Telugu News